సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : తెలంగాణ గడ్డమీద మూడు కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ల రాజ్య స్థాపనకై డాక్టర్ విశారదన్ మహరాజ్ , వారితో 30 మంది బృంద సభ్యులతో చేస్తున్న పదివేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్ర ఈనెల ఏప్రిల్ 30 హైదరాబాదులో ముగుస్తుందనీ వాల్ పోస్టర్ విడుదల... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు DSP నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పు సురేష్ మహారాజ్ మాట్లాడుతూ మార్చి 15 2022 లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ప్రారంభ సభ ప్రారంభించుకుని స్వధర్మంతో స్వశక్తితో 33 జిల్లాలు 3 వందల మండలాలు 3 వేల గ్రామాల నుండి నడుస్తూ నడుస్తూ 413 రోజులు పూర్తిచేసుకుంటు హైదరాబాద్ మహానగరంలో పాదయాత్ర జరుగుతుంది ఈ పాదయాత్ర ఏప్రిల్ 30న కాన్షిరం రణస్థలం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్స్ లో లక్షలాదిమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ముగుస్తుంది. 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు వారి కన్నీటి, కష్టాలకు ఆ వేదికపై శాశ్వత పరిష్కారం డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు ప్రకటించబోతున్నారు. అందుకు మన నాగర్ కర్నూల్ జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు 10వేల మంది గా తరలి వెళ్తున్నామని ప్రకటిస్తున్నాము. ఈ సమావేశంలో బీసీ సేన జిల్లా అధ్యక్షుడు రాముల్ యాదవ్, సాయిరాం హాస్పిటల్ డాక్టర్ విష్ణుమూర్తి గారు, రాజు మహారాజ్ ,రవికిరణ్ మహారాజ్, ఆర్ఎంపీ డాక్టర్ ఈశ్వర్ శేఖర్ పాల్గొన్నారు.
-----------------------
Admin