Sunday, 26 July 2026 12:16:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమరుల త్యాగాలు వృదాకానివ్వం... -sk సాబీర్ పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి

Date : 26 December 2022 11:06 PM Views : 891

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: ప్రజా ఉద్యమాలే సీపీఐకి ఆయుధమని, మనిషిని మనిషి దోపిడి చెయ్యని సమసమాజ నిర్మాణంకోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటివరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా పునరుద్దాటించారు.... సిపిఐ 98వ ఆవిర్భావ వార్నికోత్సవాలను పాల్వంచలోనీ చండ్ర రాజేశ్వరరావు భవన్ (సీపీఐ కార్యాలయం వద్ద) ఘనంగా నిర్వహించారు.... కార్యలయం ఎదుట అరుణపతకని ఆవిష్కరించి, 98 వసంతాల ప్రత్యేక కేకే ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో సాబీర్ పాషా మాట్లడుతూ కార్మిక, కర్షక, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టలకే ఉంది అన్నారు. దేశ స్వాతంత్ర్య కోసం, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్‌ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు. అప్పటి రజాకార్ల, భూస్వాముల, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి బాంచన్‌ దొర నీకాల్మోకుత అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సీపీఐదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. అనంతరము సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ 97 ఏండ్ల సుధిర్ణ ప్రస్తానంలో సిపిఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మికవర్ష్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజలకోసం తమ జీవితాలను త్యాగం చేశారని వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు. ఉద్యమాలు నిర్వహించి నిర్మాణపరంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో ప్రతి కార్యకర్త కృషిమరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి అడుసుమలీ సాయిబాబు, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ పద్మజ, గుండాల నాగరాజు, సుధాకర్, సీపీఐ, ప్రజాసంఘాలు నాయకులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శీను, నరహరి నాగేశ్వరరావు, ఉపేంద్ర చారి, వేములపల్లి శ్రీను, జ్యోతుల రమేష్, వీసంశెట్టి వికాస్, ఉప్పుశెట్టి రాకేష్, కోరే కృష్ణ, కాసర్ల రామారావు, చేరాలు, బిక్కులాల్, పద్మ, లక్ష్మి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కుర్రు రమేష్, మక్కన్ సింగ్, సాయి, రవి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: