సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో మహిళా దినోత్సవ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం మహిళలు పాల్గొన్నారు.మహిళాదినోత్సవం సందర్భముగా ప్రభుత్వం నిర్దేశించిన వివిధ కార్యక్రమాలు నేటితో విజయవంతముగా ముగిసాయి. డాక్టర్ ఇనొద్దీన్ ఖాన్ ( మెడికల్ ఆఫీసర్ ) మాట్లాడుతూ ఈ కార్యక్రమాలలో భాగం గా 3.3.23 తేదీ స్థానిక (కే జీ బీ వి )బాలికల పాఠశాల నందు బాల్య వివాహాలు, దిశా చట్టం, వ్యక్తిగత పరిశుభ్రత,పోషకాహారం, రక్తహీనత అంశాలపై అవగాహన, 4.3.23 మిట్ట పల్లి పాఠశాల నందు , 5.3.23 న సచివాలయముల ప్రాంగణం నందు , 7.3.23. న ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందు నిర్వహించడం జరిగింది. ఈనాటి మహిళల ర్యాలీ తో మహిళాదినోత్సవ వారోత్సవాలు విజయవంతముగా ముగిశాయి. డాక్టర్ భాను ప్రకాష్ (మెడికల్ ఆఫీసర్ ) మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు నిస్తోంది. ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, వివిధ దేశాల్లో, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో భాగమైంది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ కార్యక్రమాలలో ఆరోగ్య సిబ్బంది, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin