సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవచెరువు మండలం టి. కుంటపల్లి గ్రామంలో ఆర్ ఎం పి వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి ఘటనలో వైద్యుడు రామ్ నాథ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్టపర్తి డి.ఎస్.పి యశ్వంత్ తెలిపిన వివరాల ప్రకారం స్టెరాయిడ్స్(స్టాన్‌కోర్టు) ఇంజక్షన్ చేయడం వల్లే మందు వికటించి ముగ్గురు మృతి చెందారని తెలిపారు. ఈ ఆర్ఎంపి వైద్యుడిపై ఐపీసీ సెక్షన్ 419, 337, 304(2) నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు గుర్తించారు. ఆర్.ఎం.పి, నాటు వైద్యుల పట్ల గ్రామీణ ప్రజలకు అవగాహన ఉండాలని, తెలియని వ్యక్తుల దగ్గర వైద్యం చేయించుకోరాదని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎంపీ వైద్యులు ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు స్టీరాయిడ్స్, ప్రజలకు ఇవ్వరాదని, ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....
-----------------------
Admin