సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దొంగ హామీలు ఇచ్చే పార్టీలను ప్రజలు నమ్మొద్దని, నీతిగా నిజాయితీగా మచ్చలేని నాయకులను ప్రజలు ఆదరించాలని. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజాసేవ చేసుకుంటానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ, తూర్పుగడ్డ తాండ, గుట్టల తాండ, ఇప్పలపల్లి, రాగ్యా తాండ పోమాల్ పల్లి, కొండారెడ్డి పల్లిలో చేసిన ప్రచారానికి భారీ స్పందన లభిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం కేశంపేట్ మండలంలోని పాపిరెడ్డి గూడ, ఇప్పలపల్లి, రాగ్యా తాండా, గుట్టల తాండా, పోమాల్ పల్లి, కొండారెడ్డి పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల ప్రజలు విష్ణువర్ధన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రచారానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇతర పార్టీల నాయకులు వచ్చి మభ్యపెట్టి దొంగ హామీలతో ఓట్లు వేసుకునే నాయకులను తరిమికొట్టాలని కోరారు. గత సంవత్సరాలనుండి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సేవకుడిగా ఉంటూ సేవ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికి ఎప్పటికి ప్రజాక్షేత్రం లో ఉన్న ప్రజల మనిషిని అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి సింహం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వధించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో పసుల నర్సింహా యాదవ్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, ఆకుల ప్రదీప్, లష్కర్ నాయక్ పర్వతాలు, మహేష్, కుమార్ గుప్త, నరేందర్ రెడ్డి, విగ్నేష్, సురేష్, మహేష్, నరేందర్, అనిల్ మరియు వివిధ గ్రామాల ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin