Monday, 27 July 2026 03:44:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్" తో కేంద్రానికి కనువిప్పు కలగాలి...

Date : 07 February 2024 07:37 AM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కేంద్రంలోని బిజెపి సర్కార్ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాపితంగా జరగనున్న కార్మికుల సమ్మె, గ్రామీణ బందును విజయవంతం చేసి కేంద్రానికి కనువిప్పు కలిగించేయాలని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల జిల్లా నేతలు పిలుపునిచ్చారు. సమ్మె, బంద్ ప్రచారంలో భాగంగా మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయం "శేషగిరిభవన్"లో జగిరిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగ సీతారాములు, ప్రజాపంథా జిల్లా కెచ్చల రంగారెడ్డి, సిపిఐ ఎమ్మెల్ న్యూ డిమోక్రసీ జిల్లా నాయకులు తుపాకుల నాగేశ్వర్ రావు, టిజెఎస్ జిల్లా నాయకులూ మల్లెల రామనాధం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానివి కార్పొరేట్ విధానాలని, దేశ సంపదను, కార్మిలు, రైతుల కష్టార్జితాన్ని అదానీ, అంబానీలాంటి కార్పొరేట్ దిగ్గజాలకు కట్టబెడుతూ దేశాన్ని దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. రైతాంగానికి ప్రయోజకనకరంగా వున్నా ఎఫ్సీఐ, సీసీఐ, నాఫెడ్ వంటి సంస్థలను ఎత్తివేసే కుట్రలు చేస్తోందని అన్నారు. అశాస్త్రీయంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరలవల్ల రైతులు ఏటా రూ.4 లక్షల కోట్లు నష్టపోతున్నారని, సరైన పంటల ప్రణాళిక రూపొందించకపోవడం వల్ల రైతులు పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దేశంలో ఏర్పడిందని అన్నారు. అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకు అప్పగించి లక్షలాది మంది ఉద్యోగులను, కార్మికులను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. కార్మిక చట్టాలను పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా మార్చివేస్తోందని అన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బంగడుపుకునే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఏకమై కేంద్రాన్ని నిలదీసి దేశాన్ని రక్షించుకొవాలని ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న జరిగే సమ్మె, బందును విజయవంతం చేయాలని కోరారు. విపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు ఏపూరి బ్రహ్మం, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, కంచర్ల జమలయ్య,జి.నగేష్, కందగట్ల సురేందర్, లిక్కి బాలరాజు, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమారి, ఫహీమ్, సారంగపాణి, ముద్దా బిక్షం, అమర్లపూడి రాము, జాటోతు కృష్ణ, మోతుకూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :