సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎ.రేవంగ్త్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గోండ్వాన పంచాయతీ రాజ్ సెంటర్ ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, జీవో నెంబర్ 3 పునర్ధరణ ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 317, రద్దు ఆదివాసి నిరుద్యోగ యువత కోసం స్పెషల్ డిఎస్సి ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ మరియు తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ✅ కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. ✅ స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. ✅ ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. ✅ ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం. ✅ విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. ✅ ఆదివాసీరాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ✅ ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోడం గణేష్, [తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్] ఉయిక సుదార్శన్, [ రాష్ట్ర కోకన్వీనర్] వేట్టి మనోజ్ తుడుందేబ్బ [జీల్లా ప్రదాన కార్యదర్శి] నైతం రామేష్ [జిల్లా కార్యనిర్వణ అధ్యక్షులు] గోడం రేణుక మహిళా సంఘం [జిల్లా అధ్యక్షురాలు ] ఉయిక ఇంద్ర మహిళా సంఘం [జిల్లా ఉపాధ్యక్షురాలు] ఆత్రం భుజంగరావు [రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు] ఆత్రం గణపతి [డివిజన్ ఉపాధ్యక్షులు ] కుడుమేత ప్రకాష్ [జిల్లా ఉపాధ్యక్షుడు] మడావి దిగంబర్ [పట్టణ అధ్యక్షులు ] గేడం విష్ణు [ఆదివాసి జిల్లా నాయకులు] కుంర శాంతాబాయి [మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు] తోడసం సాంప్రకాష్, సిడాం ఆత్మరామ్, బందుకే బలరాం, పేందుర్ సంభు, సిడాం రాజు, అత్రం శివరాం, మడవి రాజు, చిక్రం సోము, పేందుర్ లింగు, సిడాం గణేష్, మడావి అనుసుయ బాయి, చహకటి అనుసుయ బాయి, ఉయిక చంద్రకాంత్, మడవి దశరథ్, సిడాం కశిరాం, మరియు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin