Sunday, 26 July 2026 09:57:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హ్యాట్రిక్ కొట్టడమే మన లక్ష్యం... -మంత్రి పువ్వాడ

Date : 10 April 2023 12:03 AM Views : 729

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ ని మళ్లీ గెలిపించి హ్యాట్రిక్ సాధించాలని, రవాణా శాఖ మంత్రి. పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదివారం ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గుర్రం ఫంక్షన్ హాల్ నందు త్రీ టౌన్ పరిధిలోని డివిజన్ ల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. మన కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి మన కుటుంబ పెద్ద అయిన కేసీఅర్ ని గెలిపించుకోవాలని సూచించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధే బీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలిచిందని కొనియాడారు. మీకు అన్ని విధాలుగా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ను మీ ద్వారా స్థానిక ప్రజలకు అందించాలని సూచించారు. మునుపెన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుని వలె పని చేయాలని, మనం చేసిన, చేస్తున్న అభివృద్ధిని వారికి తెలియచెప్పాలని కోరారు. గడచిన కాలంలో లక్షల మందికి వివిధ రకాలుగా లబ్ధి చేకూరేలా పని చేశామని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి హ్యాట్రిక్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం చరిత్రలో నిలిచిపోయే విధంగా మురికి కూపంగా ఉన్న గోళ్ళపాడు ఛానల్ ను ఆధునీకరించి అభివృద్ధి చేసుకున్నామని, ఈ ఒక్క పనితో దాదాపు 11 డివిజన్లలలోని ప్రజలు మూరుగు, దోమలు, అనారోగ్యం నుండి విముక్తులను చేసి 10 పార్కులు ఎర్పాటు చేసి ఆహ్లాదాన్ని పంచామని గుర్తు చేశారు. ఆయా డివిజన్ల ప్రజలకు మాత్రమే కాకుండా నగరం మొత్తం మనం చేసిన మంచి పనులను విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలకు విరివిగా చేరవేయల్సిన బాధ్యత మనపై ఉందని, మనం చేసిన అభివృద్ధిని మనమే చాటి చెప్పాలని కోరారు. అవసరం అయితే డివిజన్ లలో మనం చేసిన అభివృద్దిని వీడియో రూపంలో ప్రదర్శించి ప్రజలకు తెలియచెప్పాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు భోజనాలను మంత్రి పువ్వాడ స్వయంగా వడ్డించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపిలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, సుడా చైర్మన్ విజయ్, మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసి చైర్మన్ శ్వేత, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, త్రీ టౌన్ ఇంఛార్జి ఆర్జేసి కృష్ణ, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణరావు, త్రీ టౌన్ డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :