Sunday, 26 July 2026 07:56:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సున్నం పల్లి గ్రామములో మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు...

Date : 24 February 2023 11:53 PM Views : 636

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలము సున్నం పల్లి గ్రామములో మొక్కజొన్న పంటను సాగుచేసిన రైతులు ఉరవకొండ మాబు మరియు ఉరవకొండ హుస్సేనప్ప అనే రైతుల పొలాలను శాస్త్రవేత్తలు సందర్శించారు. మొక్కజొన్న పంటలకు వేసే ఎరువులు వివరాలను రైతులందరికి తెలిపి అధిక దిగుబడి వచ్చేలా తగు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు కోరారు. ఇందులో భాగంగా పంట విత్తేటప్పుడు మరియు 30 రోజులకొకసారి 45 రోజులకొకసారి 60 రోజులకు ఒకసారి 35 కిలోల చొప్పున యూరియా వెయ్యాలని సూచించారు .150 కేజీలు ఎస్ ఎస్ పి మరియు 30 కేజీల ఎం ఓ పి దుక్కిలోనే వేయాలని రైతులకు సూచనలు ఇచ్చారు. అదే పొలంలో కత్తెర పురుగులను ఆశించిన మొక్కలను పరిశీలించి ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఒక ఎకరానికి వేసుకోవాలని సూచించారు లేదా క్లోరి ఫైర్ఫాస్ 500 ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కత్తెర పురుగు చివరి దశలో ఉన్నప్పుడు విషపు ఎరలను వాడాలని సూచించారు. తరువాత తిప్పేపల్లి గ్రామం నందు బి వెంకటరమణ నాయక్ అనే రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ పంటలో ఆకు ఎండు తెగులు గుర్తించారు. ఆకులపై పొడవైన బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణ కొరకు టిల్ట్ 200 ఎం ఎల్ లేదా మ్యాన్కో జబ్ 400 గ్రాములు పిచ్చికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కదిరి పరిశోధనా కేంద్రం నుంచి వచ్చిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వేమన , సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ , సహాయ వ్యవసాయ సంచాలకులు కదిరి ఎస్.సత్యనారాయణ , మండల వ్యవసాయ అధికారి ఎస్ ఇలియాజ్ మహమ్మద్ , ఆర్.బి.కె ఇన్చార్జులు మరియు రైతులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :