సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం కేంద్రంలోని కల్మలచెరువు గ్రామంలో 25 సంవత్సరాల తర్వాత కల్మల్ చెరువు జెడ్ పి హెచ్ ఎస్ వేదిక పై ఒక్కటి అయిన పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్న నాటి విద్యార్థులు, నేటి పౌరులు పదవ తరగతి పూర్తి అయి సరిగ్గా 24 సంవత్సారాలు నిండి, 25 వ వసంతం లోకి అడుగిడిన శుభ సందర్భంగా కల్మల్ చెరువు గ్రామం జెడ్ పి హెచ్ ఎస్ లో 1996-2000 సిక్స్త్ టు టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.24 ఏండ్ల తరువాత పిల్లలు మళ్ళీ బడికి వచ్చిండ్రు, తమ బాల్యాన్ని తలుచుకున్నారు.గెట్ టు గెదర్ పార్టీని ఆనందంగా జరుపుకున్నారు.పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, పాఠశాలతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాల్య స్మృతులు మళ్ళీ గుర్తుకు వచ్చాయని తెలిపారు. ముందుగా వందేమాతరం పాటతో ప్రారంభించి సరస్వతీ మాత కు పూజ చేసినారు ,ఆ తర్వాత చిన్ననాటి క్లాస్ మేట్స్ అందరూ ఒకరిని ఒకరు సుపరిచితం చేసుకున్నారు. అందరూ కలిసి, మెలిసి సంతోషంగా తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు.అందరూ గ్రూప్ ఫొటోలు దిగారు, తమతో పాటు చదివి భౌతికంగా తమ మధ్యలో లేని చనిపోయిన వారిని స్మరించుకుని నివాళులు అర్పించారు. అందరూ పది కాలాల పాటు పిల్లా పాపలతో,ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఉపాధ్యాయులు దీవించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు తెలుగు మాష్టారు డా"రావిరాల అంజయ్య,గణితం సార్ రంగారెడ్డి ,పూర్వ వాచ్ మేన్ నర్సోజి, పూర్వ విద్యార్థులు: దుర్గ, కల్పన, రాంబాబు, చంద్రయ్య, సంజీవ్, నాగశేఖర్, రవి , రాముడు, సైదులు, ఆర్ .శ్రీను, నరేష్ , శ్యాంసుందర్, నాగాచారి,సి హెచ్ .శ్రీను తదితరులు ఉన్నారు.
-----------------------
Admin