సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను హుజూర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైశాలలో రోగులకు పండ్లు , బెడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడారు. నాడు కార్యకర్తల సంక్షేమ నీదిని ఏర్పాటు చేసి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన నాయకుడు లోకేష్ అని , నేడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం యువగలం పాదయాత్రతో ప్రజలతో మమేకమైన నాయకుడు లోకేష్ అని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో *పట్టణ పార్టీ అధ్యక్షులు కమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ , టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోష పతి , హుజూర్ నగర్ పట్టణ గౌరవాధ్యక్షులు తమ్మిశెట్టి రాములు , హుజూర్నగర్ మండల పార్టీ అధ్యక్షులు కస్తాల కనకరత్నం , బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వంశీ , హుజూర్నగర్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ , రాంబాబు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin