Monday, 27 July 2026 03:25:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో నల్ల రిబ్బన్లతో తెలుగు తమ్ముళ్ల నిరసన...

Date : 14 September 2023 08:21 AM Views : 350

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపు కొరకే అక్రమ అరెస్టు చేయించి రిమాండ్ కు పంపారని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం హుజూర్నగర్ లోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయకుండా విధ్వంసకర విధానాలతో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. జగన్ ఎన్నికలలో గెలవలేక అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, ప్రజాస్వామ్య ,ప్రజాతంత్ర వాదులు అన్ని గమనిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్రాలు అని చేత విధానాలతో ఆంధ్రప్రదేశ్ పరువు బజారున పడ్డదన్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి విధానాలను ప్రశ్నించేందుకు అన్ని వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ , మీసాల సైదులు,మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోత్ నాగు నాయక్, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కీసరి నాగయ్య ముదిరాజ్, గుండు వెంకటేశ్వర్లు గౌడ్, టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రొసపతి, మాజీ ఎంపీపీ ఆళ్ల భాగ్యమ్మ చౌదరి, హుజూర్ నగర్ పట్టణ గౌరవ అధ్యక్షులు తమ్మిశెట్టి రాములు, చింతలపాలెం మండల అధ్యక్షులు మేకల రామారావు యాదవ్, హుజూర్నగర్ మండల పార్టీ అధ్యక్షులు కష్టాల కనక రత్నం, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్య నిర్వాహ కార్యదర్శి భానోతు లక్ష్మనాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య బాలాజీ నాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మూడవత్ జానకి రామ్ నాయక్, తెలుగు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆళ్ల కోటయ్య చౌదరి, గరిడేపల్లి మండల అధికార ప్రతినిధి మర్రి రాములు, గరిడేపల్లి తెలుగు రైతు సంఘం అధ్యక్షులు వట్టికూటి అంజయ్య గౌడ్, గరిడేపల్లి బిసి నాయకులు చెరుకు రామానుజం గౌడ్, చింతలపాలెం మండల రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, రాంబాబు, అంజయ్య, సోమయ్య, రవి ,గోపి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :