సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సెప్టెంబర్ 9న జరగనున్న జాతీయ లోక్అదాలత్ ను విజయవంతం చేయాలని సోమవారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాలు లో పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వసంత్ పాటిల్ అన్నారు. రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు, ఇ -పిటి కేసుల వివరాలను ఠాణాల వారిగ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపారు. :కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ.నీరజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. రామారావు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ.సుచరిత, కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, పి.పి ఆర్ విజయ్ కుమార్, నాగిరెడ్డి, పీవీడీ లక్ష్మి, ఎ పీపీ లు విశ్వశాంతి, లావణ్య, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, డిప్యూటీ కౌన్సిల్ నిరంజన్ రావు, అసిస్టెంట్ కౌన్సిల్ జ్యోతి విశ్వకర్మ, నాగ స్రవంతి , కొత్తగూడెం కోర్టు పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, ఎ.వో అనిత వాణి, లైజన్ ఆఫీసర్ వీరబాబు, హరగోపాల్ కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
-----------------------
Admin