సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : చంద్రయాన్-3 విజయవంతం కావడం భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందని, ఇది భారతీయులందరూ గర్వించదగిన ఘట్టమని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. చంద్రయాన్-3 అద్భుతమైన సక్సెస్ సాధించడంపై అయన స్పందిస్తూ దేశం కోసం ఇస్రో శాస్త్ర వేత్తలు స్ఫూర్తిదాయక కార్యం సాధించారని కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని శాస్త్రీయ మిషన్లకు ఇది మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించిన ఇస్రో శాస్త్ర వేత్తలకు, అధికారులకు ఈ సందర్బంగా అయన అభినందనలు తెలిపారు.
-----------------------
Admin