Monday, 27 July 2026 03:44:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్లు ఎత్తేస్తాం... -షాద్ నగర్ సిఐ ప్రతాప్ లింగం

Date : 09 July 2023 05:04 AM Views : 462

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వివిధ కారణాల చేత అనేక కేసుల్లో చిక్కుకుని శాంతి పద్ధతులకు విఘాతంగా పరిణమించిన రౌడీషీటర్ల పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారని, తమ ప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని, అలాగే సమాజంలో మంచిగా జీవిస్తే వారిపై ఉన్న రౌడీషీట్లు ఎత్తివేస్తామని షాద్ నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం అల్టిమేటం జారీ చేశారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భరత్, ఎస్సైలు విజయ్, దేవిక తదితర పోలీసు సిబ్బందితో కలిసి కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లకు ఆయన వార్నింగ్ ఇస్తూ.. పట్టణంలో 38 మందిపై రౌడీషీట్స్ నమోదయ్యాయని ఆయన వివరించారు. రౌడీషీటర్లను పోలీసు సిబ్బంది పిలవగానే స్టేషనుకు రావాలని విచారణకు అన్నివేళలా సహకరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రౌడీషీటర్ల నేర ప్రవృత్తి పరిగణలో ఉంటాయని వారిపై నిత్యం పోలీస్ నిఘా ఉంటుందని పేర్కొన్నారు. వారు నివసిస్తున్న ఇంటికి జియో ట్యాగింగ్ ఉంటుందని పేర్కొన్నారు. కోర్టులు కేసులు అనవసరంగా పెంచుకోకుండా కుటుంబాలతో కలిసి జీవించి సమాజంలో శాంతిభద్రతలకు సహకరించాలని ఆయన సూచించారు. తప్పటడుగులు వేస్తే వెంటనే శిక్షించడం ఖాయమని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారిని స్థానిక తహసిల్దార్ వద్ద బైండోవర్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 21 మందిని కౌన్సిలింగ్ చేశామని మరో 17 మంది కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అన్నారు 81 మందిపై సస్పెక్ట్ షీట్ ఉందని పేర్కొన్నారు. వారికి కూడా కౌన్సిలింగ్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం 41 మంది పోలీస్ స్టేషన్ పరిధిలో జీవిస్తున్నారని మిగతా వారు వేరే చోట ఉన్నారని చెప్పారు. రౌడీషీట్లు నమోదు అయ్యాక ఇక్కడ లేనివారిని వేరే ప్రాంతాల్లో ఉంటే అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్కు రికార్డు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని అన్నారు. లైసెన్సుడు రివాల్వర్లు 27 మంది వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఒకరి వద్ద రెండు లైసెన్స్ ఉన్నాయని వివరించారు. 16 మంది లైసెన్స్ దారులకు రెన్యువల్ జరిగాయని మరో ఏడు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సైబరా బాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారి పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. నాన్ బెయిలబుల్ వారంట్ ఉన్నవారు వెంటనే పోలీసులకు లొంగిపోవాలని లేకపోతే వారిని పట్టుకుని జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 61 మంది ఉన్నారని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు. షాద్ నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు, మీడియా అన్ని వర్గాలు పోలీసులకు ఎల్లవేళల సహకరించాలని కోరారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఎస్ హేచ్ఓ అదేవిధంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, 5 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ నలుగురు, పోలీస్ కానిస్టేబుల్స్ 33 మంది, మహిళ కానిస్టేబుల్స్ 11మంది ఉన్నారని అదేవిధంగా అదేవిధంగా మరి కొంతమంది సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. శాంతిభద్రతల సంరక్షణకు అన్నీ వర్గాలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. పాఠశాలల వద్ద యూవ్ టీజింగ్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పోలీసులతో పాటు షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు విజయ్, దేవకి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: