సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజల కోసం ప్రజా సంఘాలు పని చేస్తాయి రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నేతలను నిలదీస్తాం నీళ్ళ కోసం అంటూ ప్రజాసంఘాల నేతలు మరియు పాలమూరు అధ్యయన వేదిక ఇతర ప్రజా సంఘాలతో కలిసి సిఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో బీమా కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రారంభమైన సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతమైన షాద్ నగర్ నియోజకవర్గనికి పై ప్రాజెక్టులతో నీరు అదే పరిస్థితులు లేవు అప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని రైతులు వలసలు ఆగాలని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం మరియు పాలమూరు అధ్యయన వేదిక ఇతర ప్రజా సంఘాలతో కలిసి షాద్ నగర్ ఎత్తిపోతల పేరుతో జూరాల నుండి నీళ్లు తీసుకొని మధ్యన రెండు, మూడు, రిజర్వాయర్లు కట్టి చివరగా కోందుర్గ్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి లో రిజర్వాయర్ కట్టాలని నిర్ణయించారు కొన్ని కారణాలవల్ల షాద్ నగర్ ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గా పేరు మారింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేకు కట్టడానికి అనుమతులు ఇచ్చింది కానీ 2015 ప్రాంతంలో ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని జూరాల నుండి కాకుండా శ్రీశైలానికి మార్చింది ప్రారంభించేటప్పుడు ఈ పథకంలోని చిట్టచివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టి షాద్ నగర్ నియోజకవర్గంలో సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు కానీ ఈ మధ్యకాలంలో కొత్త సచివాలయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద సమీక్ష జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమీక్షలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ఆరవది చిట్టా చివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం గురించి మాట్లాడకుండా ఎడమ కాలువ నుండి నారాయణపేట చేవెళ్ల వరకు కుడి కాలువ నుండి షాద్ నగర్ మునుగోడు వరకు త్రాగునీరు సాగునీరు ఇస్తామని అనడం కానీ అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఉదండాపూర్ రిజర్వాయర్ 590 ఫీట్లలో ఎత్తు ఉండే లక్ష్మీదేవి పల్లి షాద్ నగర్ ప్రాంతం 675 ఫీట్ల ఎత్తులో ఉంది 2018 ఎన్నికల సమయంలో షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి రిజర్వాయర్ కట్టి షాద్ నగర్ నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందిస్తామన్నారు కానీ ఆ హామీని మన పాలకులు మరిచిపోయారు కావున మీరు తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు శాసనసభలో మరియు వివిధ వేదికల్లో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడి ఈ ప్రాజెక్టు రావడానికి ప్రయత్నించగలరని విన్నవిస్తున్నాం అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు పాలమూరు అధ్యయన వేదిక మహబూబ్ నగర్ జిల్లా కన్వీనర్ రాఘవచారి, అర్జునప్ప, రవీంద్రనాథ్, బిజిలిసత్యం, రవి రాంచందర్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin