సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అర్హులందరికీ సంక్షేమ ఫలాలను చేరవేస్తుందని, మండల ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్, జడ్పిటిసి బుజ్జి మోతిలాల్ లు స్పష్టం చేశారు. మండలంలోని దేవుల తండా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలను అర్హులకు చేరవేటంలో భాగంగా ఈరోజు నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రజలు ఏ సమస్యలున్న నిర్భయంగా మండల కార్యాలయాలకు రావచ్చని తెలిపారు. రాజకీయాలు, కుల, మత వర్గ విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండల తహసిల్దార్ శ్రీదేవి మాట్లాడుతూ మండలంలోని 22 గ్రామపంచాయతీలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆయా గ్రామాల్లో తమ అధికారులు ప్రజల అవసరార్థం స్త్రీ, పురుషులకు వేరువేరు కౌంటర్లు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. తొలి రోజు ఈ గ్రామంతో పాటు గుండ్ల పహాడ్, రాఘవపురం, ఎల్లాపురం గ్రామాల్లో ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలను నివృత్తి చేయడంలో సహాయ సహకారాలు అధికారులు ప్రజలకు అందించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల నాయకులు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుమన్ నాయక్, మండల కాంగ్రెస్ సీనియర్ లీడర్, సజ్జాపురం తండా సర్పంచ్ మోతిలాల్ నాయక్, హనుమంతు, ఉప సర్పంచ్ సైదా, కోటియా తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin