సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల పాటు జిల్లా కార్యాలయం అధికారులు, సిబ్బంది కలిసి మౌనం పాటించారు.ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో సిబ్బంది ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అదేవిధంగా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఏటా జనవరి 30న భారతదేశమంతా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. అమర వీరులను స్మరించుకోవడం దేశపౌరుల బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సీఐ వెంకటేశ్వర్లు, కార్యాలయం ఏవో జయరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, రాజువర్మ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్, కృష్ణారావు, ఐటికోర్ సిబ్బంది, డీపిఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin