Sunday, 26 July 2026 09:55:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అధికారంలోకి వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి చూపిస్తాం...

Date : 06 November 2023 12:17 AM Views : 277

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం బిజెపి యే అని హుజూర్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్నగర్ పట్టణ, మండల శక్తి కేంద్రాల ఇంఛార్జి, బూతు అధ్యక్షుల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. బిజెపి మతతత్వ పార్టీ కాదని, అన్ని వర్గాల శ్రేయస్సును కోరుకునే లౌకిక పార్టీ అని అన్నారు. ముస్లింలకు త్రిపుల్ తలాక్ తొలగించి, ముస్లిం మహిళలకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పెద్దపీట వేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులను నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుంటుందని విమర్శించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ని మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకు చేరవేయాలని, దేశంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా హుజూర్నగర్ లో బిజెపి జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి కర్ణాటక ఎమ్మెల్సీ రవికుమార్, ప్రభారి ఈవి రమేష్, హుజూర్ నగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు సురేష్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అంబాల నరేష్ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షులు ఇంటి రవి, మండల అధ్యక్షులు కోటిరెడ్డి, నాయకులు గుండెబోయిన వీరబాబు, కేంద్రాల ఇన్చార్జీలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :