సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం గణేష్ ఉత్సవ కమిటీలకు అన్నపురెడ్డిపల్లి పోలీసువారు తెలియ జేయు హెచ్చరిక. మరియు విన్నపము.... అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించదాల్చిన వారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ వారిదే పూర్తి బాధ్యత అని గుర్తించాలి . అనంతరం పంచాయతీ వారి అనుమతి తీసుకోవాలి. విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలి. గ్రామాలలో వివిధ కూడళ్లు వద్ద మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పోలీసువారికి తప్పనిసరిగా తెలియజేయాలి సౌండ్ & మైకులను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసువారి అనుమతులు తప్పనిసరి. DJ సౌండ్ లకు అనుమతి లేదు అదేవిధంగా గణేష్ మండపాల ఏర్పాటు చేసే క్రమంలో రోడ్లు బ్లాక్ కావడం,ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ వారికి తగు సమాచారం అందించి వారి నుండి అనుమతులు పొందిన తరువాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు విజయవంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరుచున్నాము. అని భక్తిశ్రద్ధలతో పవిత్రముగా ఈ వినాయక చవితి పండుగని జరుపుకోవాలన SD. షాహినా ఎస్ఐ ఆఫ్ పోలీస్ తెలియజేశారు.
-----------------------
Admin