సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నీటిపారుదల శాఖ ఏఈ తుమ్మల శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈ రమేష్ బాబును ఆదేశించారు. పట్టణం లోని మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన అనంతరం జిల్లా చీఫ్ ఇంజనీర్ తో ఫోన్ లో మాట్లాడి సస్పెండ్ కు ఆదేశాలు జారీచేశారు. హుజూర్ నగర్ లోని ట్యాంక్ బండ్ ను తప్పుడు ప్రణాళికతో నిర్మించి వరదకు కారణమైన ఏఈని సస్పెండ్ చేయాలన్నారు. ట్యాంక్ బండ్ నిర్మాణ సమయంలోనే ప్లానింగ్ మార్చాలని చెప్పినప్పటికీ వరద నీటిని చెరువులో నుండి కాలువ ద్వారా శివాలయం వీధిలోకి వదలడంతో శివాలయం, గంగమ్మ దేవాలయం, గోవిందాపురం రోడ్డు లోని ఇళ్ళన్నీ మునిగాయని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఏఈ తుమ్మల శ్రీనివాస్ నీ సస్పెండ్ చేయాలని ఆదేశించారు....
-----------------------
Admin