సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గంలో సాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా సేవా పాదయాత్ర రెండవ రోజు కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో ప్రారంభమై కాపుగల్లు మీదుగా కొనసాసింది. కాపుగల్లులో మహానుభావుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గడ్డపై పుట్టి ఈ తాలూకాలో పెరిగి ప్రాథమిక చదువులు ఇక్కడే చదివి హైదరాబాదులో ఇంజనీరింగ్ వెళ్లి, బొంబాయిలో బీటెక్ చేసి అమెరికా వెళ్లి స్థిరపడి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న గుణంతో లక్షలాదిమందికి సేవ చేయాలంటే అమెరికాలో కూర్చుంటే కలవని పనని ఏసీ కార్లలో కూర్చొని సేవ చేయటంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అది రాజకీయంతోనే చేయగలుగుతామని యువత దేశానికి పట్టుకొమ్మలు కాపుగల్లు ప్రాథమిక పాఠశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్న దానికి కలెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదని వర్షాలు వస్తే మరుగుదొడ్లకు పోయే పరిస్థితి లేదని యువత సొంత డబ్బులతో అందులో నడిచే విధంగా ఖర్చుపెట్టి మరీ మట్టి పోయించడం నేను కూడా చిన్నబోయానన్నారు. గ్రామంలో నిరుపేదలైన ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి గ్రామాన ఆరోగ్య ఉప కేంద్రాలను స్థాపించి గ్రామ గ్రామాన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉన్నతను విద్యను ఆకర్షించాలన్న కాలేజీ ఫీజులు కట్టలేకున్న వారికి కోదాడ నియోజకవర్గ కేంద్రంలోని సాముల జైపాల్ రెడ్డి కార్యాలయం లో తనను సంప్రదించాలన్నారు. తొగర్రాయి గణపవరం, మీదుగా కొనసాగుతూ యర్రారం గ్రామంలో ఉగ్ర నరసింహ స్వామి దర్శించుకున్నారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యర్రవరం సర్పంచ్ వీరేపల్లీ సుబ్బారావు ని మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితుల గురించి మరియు యర్రవరం అభివృద్ధి గురించి సాముల జైపాల్ రెడ్డి చర్చించారు అనంతరం రామలక్ష్మీపురం బిక్య తండ వరకు ప్రజాసేవ పాదయాత్ర కొనసాగింది.
-----------------------
Admin