సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి భౌతికకాయానికి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం అధికారిక లాంఛనాలతో పోలీసు అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. మేదరబస్తీ లోని వారి స్వగృహం నుండి మొదలైన అంతిమయాత్ర సూపర్ బజార్ మీదుగా ఓల్డ్ డిపో రోడ్ నందు గల హిందూ స్మశానవాటికలో జిల్లా సాయుధ దళ పోలీసుల చేత పెరేడ్ నిర్వహించి మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపి అంత్యక్రియలను జరిపించారు. శ్రీదేవి మృతితో భోరున విలపిస్తున్న వారి కుటుంబసభ్యులకు పోలీసు అధికారులు ఆత్మస్తైర్యాన్ని నింపారు.
-----------------------
Admin