సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ములకలపల్లి మండల కేంద్రంలో అశ్వారావుపేట నియోజకవర్గ జన గర్జన సభ ఇన్చార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం లో పాల్గొన్న సున్నం నాగమణి జడ్పిటిసి ములకలపల్లి మరియు టిపిసిసి మెంబర్. ఈ సభ ఉద్దేశించి రాంరెడ్డి , సున్నం నాగమణి మాట్లాడుతూ అదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తిచేసుకుని ఖమ్మం చేరుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారి ముగింపు సభకు , ముఖ్యఅతిథిగా శ్రీ రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు విచ్చేసే సందర్భంగా భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , కాంగ్రెస్ పార్టీ అభిమానులు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు అందరూ కలిసి జన సమూహాన్ని వెంట తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎవరో ఊహించలేనంత ఘనంగా అందరం కలిసి జరిపించాలని అందరూ కలిసికట్టుగా రావాలని సున్నం నాగమణి తెలియజేయడం జరిగింది.
-----------------------
Admin