సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం లో పోడు భూములకు పట్టాలు కొందరికే రావడం పై వివాదం.2005 నుండి గత రెండు సంవత్సరాల వరకు పోడు భూములు సాగు చేసుకుని. వాటిపై జీవనాధారం సాగిస్తున్న గిరిజన రైతులు వారి అట్టి పోడు భూమిని ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ భూములుగా ఉన్నతాధికారులకు తెలియజేసి పోడు రైతులకు పట్టాలు రాకుండా చేయడం జరిగింది దీనిని ప్రభుత్వం గమనించి ఇన్ని సంవత్సరాలు సాగు చేసుకున్న రైతులకు అట్టి భూమిని తోడు భూమి పట్టా పాస్ పుస్తకం ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది ముదురుతోంది.. వివరాల్లోకి వెళ్లితే అన్నపురెడ్డిపల్లి, పెంట్లం, నామవరం, కంపగూడెం,. శాంతినగర్.పోడు సాగుదారులు పెద్ద ఎత్తున తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనతో నిరసనగా ధర్నా చేపట్టారు.. వర్షాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో పోడు భూముల వివాదం మొదలైంది. అధికారులు ఆక్షేపణలు, రైతులు వాగ్వాదాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది. దుక్కులు దున్నుకోవడం, విత్తనాలు వేసుకునే క్రమంలో మరింత పెరిగే అవకాశం ఉంది కనుక భదాద్రి జిల్లాలో అటవీ ప్రాంతానికి ఆనుకున్న గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. గతంలో ఆయా ప్రాంతాల్లో పోడు భూముల విషయంలో నిత్యం ఘర్షణలు జరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. స్పష్టత లేక ఇబ్బంది.. : ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించినా.. ఇప్పటికీ ప్రారంభించి గుర్తించిన అర్హులకు పట్టాలు ఎప్పుడిస్తారు? అనర్హులను ఎలా కట్టడి చేస్తారనేది స్పష్టత రాలేదు. ఇప్పటికే పోడు భూములపై అధికారులకు వందల దరఖాస్తులు అందాయి. ఇందులో కొందరిని అర్హులుగా గుర్తించి పట్టాల పంపిణీకి జాబితా సిద్ధం చేశారు అని పట్టాల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వర్షకాలం సీజన్ ప్రారంభo అవుతుండటంతో భూములను సాగు చేసుకునేందుకు, పైపులైన్లు వేసుకునేందుకు వెళ్తున్న రైతులను అటవీశా అధికారులు అడ్డుకుంటున్నారు అని బెండోవర్ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తోంది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు... ఈ కార్యక్రమంలో పొల్గొన పోడు సాగుదారులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గిరిజన రైతు బానోత్ భీముడు నాయక్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు చల్ల పుల్లయ్య, పెంట్ల ఉపసర్పంచ్ తాటి రామచంద్ర రావు, అనపురెడ్డిపల్లి మండల గిరిజన నాయకులు ధారావత్ వెంకటేశ్వర్లు, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భుక్యా చెన్నారావు , ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు లాకావత్ రాజు. బుక్య వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు చల్లా రమేష్ , మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ భాషా, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజన రైతులు మహిళలలు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin