Sunday, 26 July 2026 09:58:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దమ్ముంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలి పొంగులేటికి... -మంత్రి పువ్వాడ స‌వాల్

Date : 07 February 2023 05:58 PM Views : 724

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పువ్వాడ పాల్గొని ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ద్వారా గెలిచి, పొంగులేటికి వంత పాడుతున్న నేత‌లంతా త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి అని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న వారంతా కేసీఆర్‌కు విధేయులే. నా బ్రాండ్ నా గ్రూప్ అంటే కుద‌ర‌దు అని పువ్వాడ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్.. పొంగులేటి లాంటి వ్య‌క్తుల‌ను రాష్ట్రంలో ఎంతో మందిని చూశారు. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్షాన్ని 2009లో చీల్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడే కేసీఆర్ చ‌లించ‌లేదు అని గుర్తు చేశారు. కేసీఆర్ నీడ నుంచి వెళ్లిన వారికి రాజకీయ జీవితం లేకుండా పోయింది. కేసీఆర్ త‌యారు చేసిన నాయ‌కులు చాలా పెద్ద‌వాళ్లం అనుకుంటున్నారు. ఒక్కసారి కేసీఆర్ చేయి వ‌దిలేస్తే వారి గ‌తి అధోగ‌తే అని హెచ్చ‌రించారు. కొంద‌రు పార్టీలు కూడా పెట్టారు. ఆ పార్టీలు పాన్‌డ‌బ్బాలుగా మారిపోయాయ‌ని విమ‌ర్శించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ, తెలంగాణ‌లో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ మాత్ర‌మే జాతీయ పార్టీల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ్డాయి. మిగ‌తా పార్టీల‌న్నీ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయ‌ని పువ్వాడ అజ‌య్ కుమార్ గుర్తు చేశారు. బీ ఫామ్ ఇవ్వాల‌ని తాను ఏ ఒక్క రోజు కూడా అడ‌గ‌లేదు. మీరంతా త‌న కుటుంబ స‌భ్యులే అని స్ప‌ష్టం చేశారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్ ఏ ఒక్క రోజు కూడా త‌న స్వార్థం కోసం రాజ‌కీయాలు చేయ‌లేదు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కాకుండా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో కుంప‌టి పెడుతామ‌న‌డం స‌రికాదు. ప్ర‌తి నాయ‌కుడు పార్టీ విధానాల ప్ర‌కారం న‌డుచుకోవాలి. వైరా నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ అభ్య‌ర్థిని గెలిపించే బాధ్య‌త తానే తీసుకుంటున్నాన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. వైరాలో బీఆర్ఎస్ ఎట్ల గెల‌వ‌దో తాను చూస్తాన‌ని చెప్పారు. గ్రూపు రాజ‌కీయాలు మంచివి కావు. కేసీఆర్ఎవ‌రికీ అన్యాయం చేయ‌కుండా అంద‌రికీ ప‌ద‌వులు ఇచ్చారు. తెలంగాణ ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తి మ‌న క‌ళ్ల ముందు క‌న‌బ‌డుతుంది. ఎవ‌రో కేసీఆర్‌కు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని పువ్వాడ అజయ్ స్ప‌ష్టం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :