సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జిల్లా టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి, అర్వపల్లి పోలీసుల అధ్వర్యంలో తనిఖీలు. - తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 52 KG నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాదినం, ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీసులు. - అర్వపల్లి పోలీస్ స్టేషన్ 22 కేజి ల పట్త్తి విత్తనాలు సీజ్, ఒక నింధితుడిని అరెస్ట్ చేసిన అర్వపల్లి పోలీసు. - వ్యవసాయానికి, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. - నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం. రాహుల్ హెగ్డే ఐపి ఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా . సెక్షన్ 120 (B), 420, 487 IPC, సెక్షన్.7 of EC Act-1955, Sec 19 of Seeds act-1966, సెక్షన్.15 (1) of E.P Act-1986 ప్రకారముగా కేసులు నమోదు. జిల్లాలో నకిలీ విత్తనాల నివారణకోసం, గుర్తింపు కోసం లా అండ్ ఆర్డర్ పోలీసు తో పాటుగా టాస్క్ ఫోర్స్ టీమ్ పని చేస్తుంది, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నాము, గతంలో ఈ రకమైన నేరాలకు పాల్పడ్డ నిందితులపై కూడా దృష్టి పెట్టాం, అలవాటుగా నకిలీ విత్తనాల సరఫరా చేస్తూ నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ తప్పదు అని ఎస్పి గారు హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపి ఎస్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట DSP రవి, నాగారం CI రఘువీర్ రెడ్డి, SI లు సత్యనారాయణ, యాకూబ్, సిబ్బంది. రెండు కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్ట్, 4 గురు పరారి. తిరుమలగిరి PS కేసు : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నింధితుడిని, ప్రభుత్వ నిషేధిత గడ్డిమందును విక్రయిస్తున్న మరో నిందితుడినీ తిరుమలగిరి పోలీస్ వారు మంగళవారం రోజున అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. సుమారు 1,25,౦౦౦/- లక్షల విలువైన 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు , మూడు లక్షల యాబై వేల రూపాయల ( 3,50,000 ) విలువగల ౩౦౦ లీటర్ల నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమలగిరి టౌన్ సూర్యాపేట జిల్లాకు చెందిన సంకేపల్లి సోమిరెడ్డి వయస్సు: 53 సం లు మరియు ఈదుల పర్రె తండ, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లాకు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమర్ వయస్సు; 29 సం లు, గల నిందితులు అంధ్రప్రదేశ్, కర్నాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తు ప్రస్తుతం పరారీలో వున్న నాగ మల్లేశ్వర్ రావు గుంటూరు జిల్లా కు చెందిన వ్యక్తి నుండి తిరుమలగిరి కి చెందిన అనంత రెడ్డి అనే వ్యక్తీ నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కోనుగోలు చేసి, నింధితులు సోమిరెడ్డి, ఫ్రేమ్ లకు అమ్మగా వారు అట్టి నకిలీ విత్తనాలను అధిక ధరలకు రైతులకు అమ్మడం కోసం ఈ పత్తి విత్తనాలు గ్లయ్పొసెట్ గడ్డి మందుకు తట్టుకోనే శక్తి కలిగి వుండటంతో పాటు పత్తి దిగుబడి అధికమని, ఎక్కువమార్లు కలుపు తీయాల్సిన అవసరం లేదని, స్థానిక డీలర్ల వద్ద ఈ విత్తనాలు లభ్యం కావని తప్పుడు ప్రచారం చేసి రైతులను నమ్మించి నకిలీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరకు వియ్రించేందుకు పాల్పడగా, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో తిరుమలగిరి పోలిస్ వారు నిందితుల ఇండ్లలో దాడి నిర్వహించగా విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలతో పాటు, ప్రభుత్వ నిషేధిత ౩౦౦ లీటర్ల గడ్డి మందును స్వాదినం చేసుకుని ఇద్దరి నింధితులను అదుపులోకి తీసుకున్నారు. అర్వపల్లి PS కేసు : అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కోడూరు గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలను కల్గి ఉండి విక్రయిస్తున్న నిందితుడిని అర్వపల్లి పోలీస్ వారు మంగళవారం అదుపులోకి సుమారు 66,000 రూ,,లు విలువైన 22 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసి నిందితుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగినది. ఈ కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కోడూర్ గ్రామ పరిది, అర్వపల్లి మండలం, సూర్యాపేట్ జిల్లాకు చెందిన నిందితుడు పేర్ల వెంకన్న, తన అన్న అయిన పేర్ల బుచ్చయ్య (పస్తుతం పరారీలో వున్నాడు) తో కలిసి అదే గ్రామానికి చెందిన కంకరబోయిన ప్రసాద్ అను వ్యక్తి (పస్తుతం పరారీలో వున్నాడు) వద్ద సుమారు 15 రోజుల క్రితం నకిలీ పత్తి విత్తానాలు కొంత మొత్తం లో కొనుగోలు చేసి, స్థానిక అధీకృత డీలర్ల వద్ద ఈ విత్తనాలు లభ్యం కావని తప్పుడు ప్రచారం చేసి రైతులను నమ్మించి నకిలీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరకు వియ్రించేందుకు నిందితుడు పేర్ల వెంకన్న తన ఇంటి వద్ద నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు సిద్దంగా ఉండగా, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో అర్వపల్లి పోలీస్ వారు దాడి నిర్వహించగా విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోని నిందితుడు పేర్ల వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు.నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ అన్నదాతను నమ్మించి మోసం చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని. ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే 8712686026 వాట్సప్ నంబర్‌కు సమచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని సూర్యాపేట జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ తెలిపారు. నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులో బాగా పని చేసిన టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, తిరుమలగిరి, అర్వపల్లి పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
-----------------------
Admin