సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం శుభ పరిణామం..5 వేల బోర్లు అంటే ఆషామాషీ కాదు..! ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం రాప్తాడు ప్రజల అదృష్టం. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు ఉషశ్రీచరణ్ ఆత్మకూరులో ఆవుల పోతిరెడ్డి పొలంలో ఉచిత బోరును ప్రారంభించిన మంత్రి & ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సొంత నిధులతో నియోజకవర్గంలో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం శుభ పరిణామం. 5 వేల బోర్లు అంటే ఆషామాషీ కాదు అని స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు ఉషశ్రీ చరణ్ అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో రైతు ఆవుల పోతిరెడ్డి పొలంలో ఉచిత బోరును మంత్రితో పాటు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం రాప్తాడు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. ప్రతి బోరులోనూ ఆశించిన స్థాయిలో నీళ్లు పడాలని ఆకాంక్షించారు. రైతులకు అండగా నిలుస్తూ సొంత నిధులతో ఉచితంగా బోర్లు వేయిస్తున్న ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నేనూ రైతు బిడ్డనే. అనేక అవస్థలు, కష్టాలు అనుభవించాం. రైతే దేశానికి వెన్నెముక అలాంటి రైతులు సంతోషంగా ఉండటానికి ఎంతటి కష్టాన్నయినా భరించి రైతులకు అండగా నిలుస్తా. కష్టంతో కాకుండా ఇష్టపడి వ్యవసాయం చేసుకోవాలన్నదే నా ధ్యేయం. తోపుదుర్తి కుటుంబం రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల మంది రైతులకు ఉచితంగా బోర్లు వేయనున్నాం. ఇప్పటికే చాలా చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు ఉన్నతాధికారలు పాల్గొన్నారు..
-----------------------
Admin