సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం చెంగల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నేడు శ్రీశ్రీ శ్రీ గంగా మాత విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు గంగపుత్ర సంఘం పెద్దమనుషులు బట్టు నడిపి పెద్ద గంగారం, బట్టు సాయిలు, మాడవేడి తుపారం గంగాధర్, సాయిలు ,మందిర నిర్మాణ కర్త కుకునూరు రాజేశ్వర్ నరసయ్య తెలిపారు. అదేవిధంగా మందిర నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక నిధుల నుంచి పది లక్షల రూపాయలు ఇప్పించారు అలాగే గ్రామ ప్రజలు, వీడిసి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్ ,సర్పంచ్ కటకం చిన్న రెడ్డి ,ఉప సర్పంచ్ శోభన్ గౌడ్ ఆధ్వర్యంలో చందా దాతలు ఇప్పిచ్చినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు . దాతలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆ గంగా మాత ఆశీస్సులు ఉంటాయని రాష్ట్రంలోని జిల్లాలోని మండలంలోని గంగపుత్ర సంఘాలలో తమకు తోచిన చెందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు...
-----------------------
Admin