సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ JVL శిరీష లైన్ డిపార్ట్మెంట్స్ తో కలిపి కన్వర్జేన్సీ సమావేశమును నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్లు తమ తమ విభాగాల విధుల గూర్చి క్లుప్తంగా వివరించడం జరిగినది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ...... డిస్టిక్ పారా మీటర్స్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలని, సిబ్బంది యొక్క హాజరు బయోమెట్రిక్ విధానంలో 100% ఉండాలని, దాని ప్రకారమే జీతాలు చేయాలని, బయోమెట్రిక్ లేని చోట కన్సల్ట్ సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్లు తప్పుడు అటెండెన్స్ ఇచ్చిన ఎడల, దానికి వారే బాధ్యులు అని తెలియజేయడం జరిగినది. గతంలో ఆసుపత్రి పనులు ఎంత జరిగినవి ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది నివేదికను జిల్లా కార్యాలయమునకు సమర్పించవలెనని, ప్రతి పారామీటర్స్ పై ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి రివ్యూ నిర్వహించవలెనని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె.వి.ఎల్ శిరీష ,డిప్యూటీ డి.ఎం అండ్ హెచ్. ఓ లు డాక్టర్ సుకృత, డాక్టర్ రాజ్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు, జి జి హెచ్ సూపరింటెండెంట్ కుమారస్వామి గారు, ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ డాక్టర్. లక్ష్మణ్ రావు గారు, డి సి హెచ్ సూపరింటెండెంట్ రవి బాబు గారు ,ఎం సి హెచ్ రామవరం డాక్టర్ సరళ , పాల్వంచ ,మణుగూరు, బూర్గంపాడు,అశ్వరావుపేట ఇల్లందు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సూపరింటెండెంట్ లు, TSMIDC డిపార్ట్మెంట్, మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు
-----------------------
Admin