సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ అంటేనే కష్టాలనీ.... ఆ పార్టీనీ నమ్మితే మనకు మిగిలేది శంకరగిరి మాన్యాలేనని బీఆర్ఎస్ అభ్యర్ధి అంజయ్య యాదవ్ ఆన్నారు. గురువారం నియోజకవర్గం లోని అయోధ్యపూర్ తండా, చిన్న ఎలికిచెర్ల, శ్రీరంగపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అంజయ్య యాదవ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీరంగపూర్ లో సయ్యద్ సాదిక్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. అయోధ్యపూర్ తండా నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు, రూ.1.79 కోట్లతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు, ఆసరా పింఛన్ ధ్వారా ప్రతి నెల 316 మందికి 8.04 లక్షల రూపాయలు వస్తున్నాయన్నారు. రైతు బంధు లబ్ధిదారులు 1274 మంది, 11.84 కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 1109 మంది, 5.81కోట్లు, రైతు భీమా లబ్ధిదారులు 17 మంది, 85లక్షలు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 57 మంది, 47 లక్షలు, స్మశానవాటిక నిర్మాణం కోసం 37 లక్షలు, అయోధ్యపూర్ తండా నుండి రామన్నగడ్డ వరకు 1.26 కోట్లతో బి.టి రోడ్డు, కొప్పుకుంట తండా సిసి రోడ్ 60 లక్షలు, Pr రోడ్ నుండి చిలుం బాయి తండా వరకు 1.5 కోట్లతో రోడ్, Pr రోడ్ నుండి దేవునిపల్లి వయా చిన్న ఎలికిచెర్ల బి.టి రిన్యూవల్ 4.15 కోట్లు, చిన్న ఎలికిచెర్ల నుండి సాలోనికోట రోడ్ కల్వర్టు 50 లక్షలు, R&B రోడ్ నుండి సోమరంపాడ్ 32 లక్షలు, Pr రోడ్ నుండి శ్రీరంగపూర్ 50 లక్షలు, అయోధ్య పూర్ తండా గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలు, 2.30 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 8 ట్యాంకుల నిర్మాణంతో 806 ఇండ్లకు త్రాగునీటి సరఫరా వంటి అభివృద్ది పనులను పూర్తి చేశామన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించి అభివృద్ధిని కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు.
-----------------------
Admin