సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహడ్ పట్టణంలోని ప్రధాన సెంటర్ సమీపంలో బూర్గంపహడ్ అదనపు ఎస్.ఐ శ్రీను నాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు....వాహనాలు మొత్తం సున్నంగా పరిశీలించి గంజాయి,గుట్కా మాదక ద్రవ్యాలతో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడమే కాక వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి అని,యువత గంజాయి వైపు దారి మళ్లకుండా మంచి భవిష్యత్తును అందించడం మన అందరి బాధ్యత అని ఇధి సామాజిక చెడు ప్రమాదకరం అని,మొగ్గ దశలోనే దీనిని తుంచివేయాలి అని ఎస్ఐ శ్రీను నాయక్ వాహన దారులకు తెలిపారు,అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే కటకటాలు లెక్కించాల్సి వస్తుంది అని,అలాగే ద్విచక్ర వాహనదారులు ప్రధాన రహదారి మీదకు వచ్చేప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని,అలాగే ప్రతిఒక్క వాహనదారులు తప్పనిసరి వాహనానికి సంబంధిత సరిఅయిన పత్రాలు వాహనం నడిపేటప్పుడు దగ్గర ఉంచుకోవాలి అని,అలాగే వాహనాల నంబర్ ప్లేట్ లు సరిగ్గా వుండేలా చూసుకోవాలి అని,నూతన వాహనాలు రిజిస్ట్రషన్ చేసుకొని నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాతే వాహనాలు రోడ్డు పై నడపాలి అని లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య వారి సిబ్బంది వెంకట రమణ,శ్రీను పాల్గొన్నారు.
-----------------------
Admin