సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డ్రగ్స్ స్మగ్లర్‌గా మారాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయిస్తూ హెచ్‌న్యూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ప్రేమలో విఫలం కావడంతో స్నేహితులతో కలిసి పబ్‌లకు వెళ్లేవాడు. అతడికి ఓజీ కుష్ (గంజాయి) అలవాటైంది... తర్వాత కొకైన్ అలవాటు చేసుకున్నాడు. దానికోసం గోవా, బెంగళూరు వెళ్లేవాడు. అక్కడ నైజీరియన్ స్మగ్లర్స్‌తో పరిచయం పెంచుకుని తానూ స్మగ్లర్‌గా మారాడు. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. హెచ్‌న్యూ పోలీసులు బొల్లారం పరిధిలో హర్షను అరెస్టు చేశారు. రూ.3.10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు....
-----------------------
Admin