సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : శ్రావణమాస బోనాల ఉత్సవాలు కొత్తగూడెంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరేగింపుగా బోనాలతో బయలుదేరిన ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి దీప,దూపనైవేద్యాలను సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పోచమ్మ తల్లి దేవాలయ వ్యవస్థాపకులు పల్లా రాజనర్సు ఆధ్వర్యంలో నిర్వహించిన బొనాల ఉత్సవాలలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో , సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
-----------------------
Admin