Sunday, 26 July 2026 08:21:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీజేపీ, బిఆర్ఎస్ దొందు దొందే... - టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 28 August 2023 09:15 AM Views : 296

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఖమ్మంలో జరిగే బిజెపి అమిత్ షా మీటింగ్ కు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను పంపడం సిగ్గుచేటని టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకే తాను గుడ్డలని ఆరోపించారు. వీరిద్దరు అందరి ముందు కుస్తీ తెరవెనుక దోస్తీ అన్నట్టు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నాని నాగా సీతారాములు ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనగర్జన సభకు బస్సులు కావాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరితే ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా సభను అడ్డుకోవాలని చూసిన బిఆర్ఎస్ ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పువ్వాడ నేడు బీజేపీ పార్టీ చేపట్టిన సభకు అమిత్ షా వస్తుంటే జీహుజూర్ అంటూ బస్సులు ఇవ్వడం పద్దతేనా అంటూ ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ కి బిజెపి బీ టీం అన్న ఆయన కేవలం కల్వకుంట్ల కవిత అరెస్ట్ ను ఆపేందుకే కేసీఆర్ బీజేపీ ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తూము చౌదరి, తాండ్ర నాగబాబు, కనకరాజు ,మారెడ్ల నరసింహారెడ్డి, దుర్గారాశి సతీష్, వనమా రాము, చిమట నాగేశ్వరావు, వెంకటేష్, మహేష్, కల్లూరి సంపత్, వాంకుడోత్ రవి, రాము, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: