సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో గ్రీవెన్స్ నమోదు రిజిస్టర్ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. బుధవారం మధ్యాహ్నం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పెన్షన్లపై అందిన దరఖాస్తులపై అధికారులు తీసుకుంటున్న చర్యలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదుల నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. ఫిర్యాదుదారుల నుండి వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా ఎంపీడీవో లకు పంపనైనదని డి ఆర్ డి ఓ కిరణ్ కుమార్ కలెక్టర్ కు వివరించారు. ఎంపీడీవోలకు పంపిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించే విధంగా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక నుండి ప్రతి సోమవారం శాఖల వారీగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల వివరాలను సమీక్షించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
-----------------------
Admin