సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో Dr Rahil , ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినది ఈ ఆరోగ్య శిబిరం నందు 65 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయడం జరిగినది పదిమంది జ్వరపీడుతలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా ఎటువంటి మలేరియా గా నమోదు అవ్వలేదు డాక్టర్ గారు మాట్లాడుతూ వాతావరణ మార్పుల వలన చర్మ వ్యాధులు కొంతమందికి రావడం జరిగినది. వారికి చికిత్స చేసి చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు చర్యల గురించి నివారణ పద్ధతుల గురించి తెలియజేయుట జరిగినది అసంక్రమిత వ్యాధుల కొరకు పరీక్షలు చేయగా కొత్తగా ఇద్దరికీ BP ఉన్నట్లు నిర్ధారణ అవగా చికిత్స మొదలుపెట్టడం జరిగినది కాలానుగుణంగా వాతావరణ మార్పుల వలన జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కాచి చల్లార్చిన నీరు త్రాగుకుంటా, దోమలు కుట్టకుండా రక్షించుకుంటూ, వ్యాధి నిరోధకతను పెంచుకొనుటకు సమతుల ఆహారం తీసుకోవాలని తెలియజేయటం జరిగినది ఈ కార్యక్రమంలో HEO వేణుగోపాల్ కృష్ణ, HA తిరుపతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin