సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మంత్రి సీతక్క ఆశీర్వాదాలతో... రెండవసారి ఏకగ్రీవంగా ములుగు జిల్లా అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందుకున్న పైడాకుల అశోక్ గారు... కష్టపడిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పదవులతో సత్కరిస్తుంది..హైదరాబాద్ నందు గల గాంధీభవన్ నందు టిపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామక పత్రాన్ని పైడాకుల అశోక్ అందుకున్నారు. ఈ సందర్భముగా అశోక్ మాట్లాడుతూ రెండవసారి నన్ను నమ్మి నాకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన ఏఐసీసీ అగ్ర నేతలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, మంత్రి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది అని, పనిని బట్టి వారికి పదవులు ఇస్తారని అన్నారు. నాకు మరొకసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సీతక్క గారి అడుగు జాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడమే లక్ష్యంగా పని చేస్తా అని అన్నారు.
-----------------------
Reporter