సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల కొరకు 2019 అక్టోబర్ 1 నాటికి ఎవరైతే డిగ్రీ లేదా డిప్లొమా,ఇంజనీరింగ్ ఓపెన్ డిగ్రీ పూర్తి అయిన పట్టభద్రులందరూ మీ ఓటు నమోదు చేసుకోవాలని టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు నమోదు కోసం పారం 18 ఎమ్మార్వో ఆఫీస్ లో కానీ ఆర్డీవో ఆఫీస్ లో కానీ లేదా online website https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx లో మీ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు .మార్చిలో జరగబోయే ఈ ఎన్నికలలో పశ్చిమ రాయలసీమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాలరెడ్డి ని పట్టబద్రులు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించలని తెలుగుదేశం పార్టీ నాయకులూ కార్యకర్తలు కోరుతున్నాము.ఈ కార్యక్రమం లో శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శు సామకోటి ఆదినారాయణ ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్ ప్రధానకార్యదర్శి మంజునాథ్ నాయకులూ పల్లపు శివశంకర్ మురళి నాయుడు ఆదినారాయణ గంగరాజు పాల్గొన్నారు.
-----------------------
Admin