సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని చింతగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు దేవునిపల్లి బసప్ప, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నాగి సాయిలు సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు రాజు అధ్యక్షతన ఆదివారము ఎస్సీ సెల్, బీసీ సెల్ గ్రామ కమిటీలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్రాతి బాలరాజు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ కమిటీ బీసీ సెల్ అధ్యక్షులుగా గూల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వంగూరు యాదయ్య, ఉపాధ్యక్షులుగా ఈదుగాని పల్లి సురేష్, ప్రధాన కార్యదర్శిగా మాడెమోని రమేష్, కార్యదర్శిగా ఆలూరి జగన్, కోశాధికారిగా కటికేరి వెంకటయ్య, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా బోవోల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మామిడిపల్లి అశోక్, ఉపాధ్యక్షులుగా బచ్చల శ్రీకాంత్ ఎర్రవల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా చిన్న బచ్చలి వెంకటయ్య, కార్యదర్శిగా బోవోల్ల యాదయ్య, కోశాధికారిగా చిన్న బచ్చలి చిన్నయ్యనూ గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బి.మహేష్ రమేష్,రాజు, శ్రీనివాసులు, రవి, మల్లారెడ్డి, అశోక్, శ్రీశైలం, వెంకటేష్, యాదయ్య, జి.రమేష్, బి.వెంకటేష్, బి మహేష్, బి రాధాకృష్ణ, ఏ జగన్ యాదవ్, బీ చెన్నయ్య, బి చెన్నయ్య, బి పెంటయ్య, ఎం అశోక్, బి రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin