Sunday, 26 July 2026 10:59:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తిరగబడదాం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొడదాం... -టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్

Date : 28 August 2023 09:58 AM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గం, జిల్లేడు చౌదర్ గూడెం మండల్ లో మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్న బీఆర్ఎస్ పార్టీని.. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని బిజెపి పార్టీలను రాష్ట్రంలో లేకుండా తరిమికొడదామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. జిల్లేడు చౌదరిగుడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు ఆధ్వర్యంలో జిల్లేడు గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నూతనంగా తీసుకువచ్చిన నినాదం తరిమికొడదాం తిరగబడదాం అని వాల్ పోస్టర్లను ఆవిష్కరించడంతో పాటు రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ లను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు హామీలు ఇవ్వడం కానీ వాటిని అమలు చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండా పోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకు వస్తున్న డిక్లరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వంకు భయాందోళన చుట్టుకుందని ఆయన అన్నారు. నాడు గ్రామాల సంక్షేమం కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని నేడు గ్రామాల్లో ప్రజలు గుర్తు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు అందించిన లాభాలే ఇందుకు నిదర్శనం అని ఆయన అన్నారు. నాడు వైఎస్ఆర్ హయ్యంలో ఇండ్లు భూములు రేషన్ కార్డులు వంటివి ఎలాంటి ఆంక్షలు లేకుండా అందిస్తే నేడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలతో పార్టీలోకి లాక్కొని హామీలు ఇచ్చిన ఈ పక్కన పెట్టి తాత్కాలికంగా సంక్షేమ పథకాలు సృష్టించి వారికి అందజేస్తూ మభ్యపెడుతున్నారని అన్నారు. గ్రామాల్లోని ఇతర పార్టీల నాయకులను సంక్షేమాల పేరిట వలవేసి మభ్యపెడుతూ భయాందోళనకు గురి చేస్తూ పార్టీలోకి లాక్కుంటున్నారని అన్నారు నిదర్శనం అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా నిత్యవసర సరుకుల ధరలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ వంటి ధరలను పెంచి సామాన్యుడు నడి విరుస్తుందని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తూ కష్టాలు తీర్చనిందని అన్నారు ఆరోగ్య శ్రీ వంటి బృహత్తర పథకానికి మరోసారి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఉచిత వైద్యాన్ని అందించనున్నట్లు తెలిపారు అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరిట పథకాన్ని పునరుద్ధరిస్తు ఆరు లక్షల రూపాయలతో పాటు ప్లాట్ లేని వారికి ప్లాటు సైతం గ్రామాల్లో అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ముఖ్యంగా తొమ్మిది రకాల రేషన్ సరుకులను అందించడానికి వెనుకాడేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ పేదలకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో నాలుగువేల రూపాయల పింఛన్ ప్రతి అర్హులైన వారందరికీ అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు నేడు గ్రామాల్లో చీరలు ఎందుకు పంచుతున్నారో వారికే తెలియాలని చీరలు పంచినంత మాత్రాన ప్రజల కష్టాలు తీరవని అన్నారు మేము అనుకుంటే ఇంటికి 4 చీరలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పిట్ట రజిత, ఎంపిటిసిల సంఘం మండల అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిరిధర్,బికం శశిధర్, ఎల్లెశ్వర్, సత్తయ్య, ఎల్ రెడ్డి, బాలయ్య, ఎంపీపీ తనయుడు ఆంజనేయులు, జితేందర్ రెడ్డి, సలీం,నర్సింలు, శేఖర్, వెంకట నరసింహారెడ్డి, దామోదర్, ఖలీల్, వెంకట్ రాములు, శ్రీనివాస్, కాస్లాబాద్ పాపయ్య, మల్లేష్, పిట్టే వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్, అన్వర్, భాస్కర్, జక్కని రవి, సురేందర్, చందు నాయక్ తోపాటు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: