సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర యువనాయకుడు ఏపీ మిథున్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో తన అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు షాద్ నగర్ సిటీటైమ్స్ మీడియా ప్రతినిధికి తెలిపారు. మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి రాజకీయ వారసుడైన ఏపీ మిథున్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం నుండి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఆయన వెంట బిజెపి సీనియర్ నాయకులు పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఏపీ మిథున్ రెడ్డి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఎలక్షన్ క్యాంపెయిన్ 2019 పార్లమెంటరీ ఎన్నికలలో కీలక పాత్ర పోషించారు. చేవెళ్ల (అసెంబ్లీ) ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా క్రియాశీల పాత్ర పోషించారు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, మరియు మునుగోడు ఉప ఎన్నికలతో పాటు జిహెచ్‌ఎంసి, షాద్‌నగర్ నియోజక వర్గం జెడ్‌పిటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 5 దశలకు ప్రచారతల ప్రబంధక్ గా వ్యవహరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఎన్ఈసీ సమావేశం మరియు ఖమ్మం అమిత్ షా సభ కోసం వేదిక మరియు అలంకరణ ఇంచార్జిలలో మిథున్ రెడ్డి ఒకరుగా ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో షాద్‌నగర్‌లో అత్యవసరమైన అవసరమైన మస్కులు , హ్యాండ్ శానిటైజర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేయడం ద్వారా కీలకమైన సహాయాన్ని అందించారు. మరియు అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. గ్రాస్‌రూట్ ప్రచారం.. ప్రజా గోస బీజేపీ భరోసా - స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, రాష్ట్రం నియోజక వర్గం అంతటా అన్ని పార్టీ కార్యకలాపాలో పాల్గొన్నారు. చాలాకాలంగా మిథున్ రెడ్డి షాద్ నగర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఒక ఇంటిని కూడా నిర్మించుకున్నారు.
-----------------------
Admin