సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లోని మున్సిపల్ సమావేశంలో మూడో వార్డు పట్టణంలో పలు సమస్యలపై చర్చ జరిపి కౌన్సిల్ సమావేశంలో మూడో వార్డు కౌన్సిలర్ కోతిసంపత్ రెడ్డి మాట్లాడుతూ మూడో వార్డులో ప్రధాన రహదారులైన ఎన్జీవోస్ కాలనీ మెయిన్ సీసీ రోడ్డు చైతన్య స్కూల్ వరకు మెయిన్ సీసీ రోడ్డు నిర్మాణంలకు నూతనంగా నిర్మించాలని ప్రతిపాదన చేయడం జరిగింది.రేపు రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మూడవ వార్డ్ ఎన్జీవోస్ కాలనీ ఆనుకొని ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ కట్ట దెబ్బతిన్న ప్రాంతాల్లో మట్టిని తోలించాలని కోరడం జరిగింది. వార్డ్ లో నూతనంగా ఇంటి నిర్మాణాలు ఎక్కువగా చేపడుతుడటం తో విద్యుత్ వినియోగం ఎక్కువ అవడం తో లో - వోల్టేజ్ సమస్యతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత విద్యుత్ శాఖతో చర్చించి కావాల్సిన నిధులను కేటాయించి నిరుపయోగంగా ఉన్న ట్రాన్స్ఫారాని వినియోగంలోకి తీసుకురావాలని కొత్త బస్టాండ్ లో సుమారు మూడు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో నిర్మాణం చేపట్టినటువంటి ప్రజా మరుగుదొడ్ల కి వాచ్మెన్ కేటాయించి వినియోగంలోకి తీసుకురావాలని నూతనంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో 10% భూమిని మున్సిపాలిటీ కేటాయించకుండానే అమ్మకాలు కొనుగోలు జరుపుతున్నారని గతంలో మున్సిపాలిటీ కేటాయించిన భూములని కాపాడడంలో అధికారులు విఫలమవుతున్నారని ఇట్టి విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అని అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి నిధులతో హుజూర్ నగర్ పట్టణంలో వివిధ వార్డుల్లో కేటాయించిన అంగన్వాడి స్కూల్స్ కమ్యూనిటీ హాల్స్ కి కావాల్సిన స్థల సేకరణ కి మున్సిపల్ తీర్మానం చేసి కలెక్టర్ కి పంపవలసిందిగా కౌన్సిల్ని కోరడం జరిగింది.ఈకార్యక్రమంలోkకాస్తాల శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జక్కుల వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin