సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని దుద్దుకుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్వగ్రామమైన నల్లమాడ మండలం నల్లసింగయ్య గారి పల్లిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఓబుల దేవర చెరువు మండలం తంగేడుకుంటలో వైద్య శిబిరం వాల్ పోస్టర్లను వైసిపి నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు, కంటి అద్దాలు, స్త్రీలకు వైద్య పరీక్షలు, గుండె జబ్బులకు పరీక్షలు, దంత పరీక్షలు తదితర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ షామీర్, జడ్పీటీసీ సభ్యులు దామోదర్ రెడ్డి, తంగేడు కుంట సర్పంచ్ అబిదారఫిక్, మండల అగ్రి అడ్వైజరీ చైర్మన్ లక్ష్మిరెడ్డి ఓడీసీ టౌన్ కన్వీనర్ కృష్ణ రెడ్డి నల్లమాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు....
-----------------------
Admin