సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం అవినీతిరహిత ప్రోగ్రాం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డి.ఎస్.పి హుస్సేన్ పీరా మరియు విజిలెన్స్ సీఐ రామారావు , సిఐ వెంకటరమణా , ఏవో వాసు ప్రకాష్ , సీటీవో విజయలక్ష్మి , ఎస్సై ఫణిందర్ , ఎస్సై బాలకృష్ణ , అనంతపురం జిల్లా కురుగుంట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం కాలేజ్ నందు అవినీతి రహితంగా రాష్ట్రం కావాలన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది వీటిలో భాగంగా విద్యార్థినిలు కూడా పురుషులకు దీటుగా మహిళలు కూడా ఉన్నత శిఖరాలకు చేరాలని అంబేద్కర్ ఆలోచనా విధానం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజ్ ప్రిన్సిపల్ ఉదయ్ శ్రీ , వైస్ ప్రిన్సిపల్ వసుధ ,గోవింద్ రాజులు , పుష్పలత మరియు అక్కడున్నటువంటి ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయులు ,సత్యసాయి జిల్లా అధ్యక్షులు బంగి ఓబుళపతి ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin