సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు . ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన అర్థరాత్రి కిడ్నాప్ హైడ్రామా లో ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రియేట్ చేసిందే ఓ సర్వే సంస్థ (చాణిక్య పి ఓ పి) లో పనిచేస్తున్న స్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టుగా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు హైడ్రామా క్రియేట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కి నిజాలు తెలియాలి.ఒక దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి స్వామి అనే ఏజెన్సీకి చెందిన వ్యక్తి తమ దగ్గర పని చేశాడని తానే ఆఫీస్ వద్దకు వచ్చి మాట్లాడి వెళ్లడం జరిగిందని దాన్ని ఏదో మసిబూసి మారేడు కాయ చేసే విధంగా కిడ్నాప్ అనే కొత్త రకం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలను ఉదృతంగా చేసే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి తయారైంది. ఎక్కడ ఓడిపోతానని భయంతోటి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆయన చేస్తున్నారని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలంతా కూడా టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ విషయాన్ని పసిగట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఓడిపోతాను అనే ఒక భయంతోటి గుడ్డ కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒకరి వద్ద పనిచేస్తూ మరొకరి ఆఫీసులో ఉండటం ఎంతవరకు సమంజసం మో ఒకసారి ఆలోచించాలి. టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలను పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం ఒకవేళ పార్టీలోకి రాపోతే వాళ్ళని బెదిరింపు ధోరణికి గురి చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పనులు కార్యకర్తలకు ఒక మనవి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటివి ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడిన మరో ఏడు రోజులు మనం శ్రమిద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గం నుండి పంపిద్దం గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎంపీగా ఉంటూ ఇంత చిల్లర రాజకీయాలు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కుతుందని ఆరోపించారు.తమ దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఒక గూఢచారిలా వ్యవహరిస్తూ స్వామి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చేరవేయడం జరుగుతుందని అన్నారు. స్వామి సృజన ఈ ఇద్దరు కూడా ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ తమ వద్దకు ఎప్పుడు వచ్చి వెళ్తుంటారని అదే క్రమంలో తనతో నిన్న ఉన్న కార్యకర్తలు స్వామి మరియు సృజనతో మాట్లాడడం జరిగిందని దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కిడ్నాప్ డ్రామా క్రియేట్ చేయడం జరిగిందని అన్నారు.. నిజంగా అతన్ని ఎవరో కిడ్నాప్ చేస్తే పోలీస్ స్టేషన్ వద్దకి ఎలా వెళ్లి కేసు పెడతాడు.ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేస్తే ఎవ్వరూ దొంగో అర్దం అవుతుంది అన్నారు. రేపు జరగనున్న యువ నాయకులు మంత్రివర్యులు కేటీఆర్ రోడ్డు షోను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా విన్నవించుకుంటున్నట్లు తెలిపారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించిన మంత్రి కేటీఆర్ కి పెద్ద స్థాయిలో బిఆర్ఎస్ శ్రేణులు విచ్చేసి స్వాగతం తెలపాలని పిలుపునిచ్చారు.
-----------------------
Admin