Monday, 27 July 2026 07:40:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

???? సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే అర్హతలు

Date : 04 October 2025 08:47 AM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ (డి కుమార్ రిపోర్టర్) *అర్హతలు:-* సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు. ఈ క్రింది వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు :-* గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ పోటీకి అనర్హులు. చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులు. నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు. నేర శిక్షను అనుభవించిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి కాని వారు కూడా అనర్హులు. మతిస్థిమితం లేని వారు.బదిరులు, మూగవారు అనర్హులు. పౌరహక్కుల పరిరక్షణచట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు . దివాళాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు.రుణ విమోచన పొందని దివాళాదారు కూడా పోటీకి అనర్హుడు. గ్రామ పంచాయతీ కి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు.బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా దీనికి అనర్హులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగుల తో పాటు స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ విశ్వాస ఘాతుకానికి గానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ పోటీకి అనర్హులు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా.. అనర్హులుగా గుర్తించబడతారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :