Sunday, 26 July 2026 10:52:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తిరగబడదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొడదాం... -పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రచార కమిటీ కో - చైర్మన్

Date : 31 August 2023 03:46 AM Views : 298

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మోసపూరిత వాగ్దానాలతో మభ్య పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని బిజెపి పార్టీలను రాష్ట్రంలో లేకుండా తరిమికొడదామని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా రామవరం, ప్రశాంత్ నగర్ ప్రాంతంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యమాన్ని ప్రారంభించిన సందర్బంగా స్థానిక ప్రజలను కలుసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ లను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగా సీతారాములు మాట్లాడుతు సీఎం కేసీఆర్ ప్రజలకు హామీలు ఇవ్వడమే కానీ వాటిని అమలు చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండా పోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకు వస్తున్న డిక్లరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వంలో భయాందోళన నెలకొందని అన్నారు. గ్రామాల సంక్షేమం కోసం నాడు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సంక్షేమ పథకాల వల్ల లబ్ది పొందిన వారు కాంగ్రెస్ పార్టీనీ గెలుపు కోసం కృషి చేస్తామని అంటున్నారంటే అప్పటి కాంగ్రెస్ నాయకులు లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందించిన పథకాలే కారణం అన్నారు. నాడు వైఎస్ఆర్ హయ్యంలో ఇందిరమ్మ ఇండ్లు, భూములు, రేషన్ కార్డులు వంటివి ఎలాంటి ఆంక్షలు లేకుండా అందిస్తే నేడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలతో పార్టీలోకి వలస వచ్చిన వారికి, ఎమ్మెల్యే అనుచరులు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు అందజేస్తూ, అర్హులైన లబ్ధిదారులను మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గ్రామాల్లోని ఇతర పార్టీల నాయకులను సంక్షేమాల పేరిట వలవేసి మభ్యపెడుతూ భయాందోళనకు గురి చేస్తూ పార్టీలోకి లాక్కుంటున్నారని తర్వాత వారికి మొండి చేయి ఇవ్వడం తద్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ వంటి ధరలను పెంచి సామాన్యుడు నడి విరుస్తుందని కంటితుడుపు చర్యగా 200 గ్యాస్ ధర తగ్గించిన బీజేపీ అదేదో ఘనకార్యం అన్నట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తూ పేదింటి మహిళల కష్టాలు తీరుస్తుందనీ అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర పథకానికి మరోసారి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఉచిత వైద్యాన్ని అందించనున్నట్లు తెలిపారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరిట పథకాన్ని పునరుద్ధరిస్తు ఆరు లక్షల రూపాయలతో పాటు భూములు లేని వారికి భూములు సైతం గ్రామాల్లో అందించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా తొమ్మిది రకాల రేషన్ సరుకులను కాంగ్రెస్ పార్టీ పేదలకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో నాలుగువేల రూపాయల పింఛన్ ప్రతి అర్హులైన వారందరికీ అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, ఆకునూరి కనకరాజు, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, బోదాసు కనకరాజు, కొల్లి సమ్మయ్య, జిల్లా నాయకులు, యువజన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: