Sunday, 26 July 2026 01:29:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో టిడిపి ఆధ్వరంలో ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా... - ప్రధాన కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు గౌడ్

Date : 30 August 2023 02:19 AM Views : 260

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలుగుదేశం పార్టీ నలగొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసవి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశం మేరకు హుజూర్ నగర్ లోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. 22 లక్షల పైగా ఇండ్లు లేని బాధితులు ఉంటే కొన్ని కూడా నిర్మాణం చేయకుండా పేద ప్రజలను మోసం చేశారని , ఇండ్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఇస్తానన్న హామీని కూడా విస్మరించారని అన్నారు. గృహలక్ష్మి పథకం కూడా ప్రజలను మధ్య పెట్టే పథకమేనని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం విడ్డూరమన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని , పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, గిరిజనులకు, మైనారిటీలకు ఇస్తానన్న 12% రిజర్వేషన్లను ఇవ్వాలని ,ఎస్సీ ,ఎస్టీలకు ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులను ఇచ్చి ఆయా వర్గాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డిఓ కార్యాలయంలోని డిఓ నారాయణ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ , మీసాల సైదులు, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోతు నాగు నాయక్, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కీసరి నాగయ్య ముదిరాజ్ , గుండు వెంకటేశ్వర్లు గౌడ్ మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షులు చిన్నపంగు నాగరాజు , హుజూర్ నగర్ మండల పార్టీ అధ్యక్ష ప్రధాన ,కార్యదర్శులు కస్తాల కనకరత్నం, తురక గోపి చింతలపాలెం మండల పార్టీ అధ్యక్షులు మేకల రామారావు యాదవ్, మాజీ ఎంపీపీ ఆళ్ల భాగ్యమ్మ చౌదరి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య బాలాజీ నాయక్ , కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు చీకూరి గోవిందరావు , పార్టీ సీనియర్ నాయకులు తమ్మిశెట్టి రాములు, హుజూర్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ ,తెలుగు యువత నాయకులు, అంజయ్య , రాంబాబు , లింగయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :