సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇళ్ల నిర్మాణాలకు ఇనుము, సిమెంట్, ఇసుక ఇతర వస్తువుల ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని సిపిఐ నాయకులు సోమవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ఆంజనేయులు, చలపతి నాయుడు మాట్లాడుతూ... ప్రభుత్వం ఒక్కో ఇంటికి కేవలం రూ.1.80 లక్షల చొప్పున మాత్రమే బిల్లులు చెల్లిస్తోంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణం లబ్దిదారులకు పెను బారంగా మారింది. పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు పెంచుతూ లబ్దిదారులకు బిల్లులు చెల్లించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన ఓ వినతి పత్రాన్ని తహసీల్దార్ శ్రీధర్ కు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పూల శ్రీనివాసులు, రత్నాబాయి, రామాంజి, నరసింహులు, లక్ష్మీనరసు, రామచంద్ర, రమణమ్మ నిర్వహించారు....
-----------------------
Admin